True Lover: ఇది ప్రేమికుల కథ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కథ: దర్శకుడు మారుతి

True Lover Press Meet

  • మణికందన్ హీరోగా రూపొందిన 'ట్రూ లవర్'
  • ఆయన సరసన సందడి చేయనున్న గౌరీ ప్రియా 
  • ఈ నెల 10వ తేదీన విడుదలవుతున్న సినిమా 
  • ఇదే జోడీతో తెలుగు సినిమా చేస్తామన్న మారుతి


తమిళంలో హీరోగా మణికందన్ కి మంచి పేరు ఉంది. 'గుడ్ నైట్' సినిమా ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులోకి రావడం వలన, ఇక్కడి ప్రేక్షకులకు మణికందన్ మరింత చేరువయ్యాడు. ఆయన హీరోగా చేసిన తాజా చిత్రం తమిళంలో 'లవర్' పేరుతో ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. 'ట్రూ  లవర్' పేరుతో ఈ నెల 10వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ఇక్కడ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదికపై మారుతి మాట్లాడుతూ, "ఈ సినిమాను చూసి నేను ఎలాంటి అనుభూతినైతే పొందానో, అదే అనుభూతిని ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ పొందుతారని భావిస్తున్నాను. ఎక్కడా కూడా సినిమాటిక్ గా కాకుండా, చాలా జన్యూన్ గా .. ఆర్గానిక్ గా అనిపిస్తుంది" అని అన్నాడు.

ఇది లవర్స్ కథనే అయినా ఫ్యామిలీ ఆడియన్స్ సరదాగా చూసేలా ఉంటుంది. మణికందన్ ను చూస్తే మన తెలుగు హీరోనే అనిపిస్తుంది. ఇక తెలుగు అమ్మాయి అయిన గౌరీప్రియా చాలా బాగా చేసింది. ఈ ఇద్దరితో తెలుగు సినిమా ఒకటి చేయాలనుకుంటున్నాము. దర్శకుడు ప్రభువ్యాస్ ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

True Lover
Manikandan
Gouri Priya
Maruthi
  • Loading...

More Telugu News