Yandamuri: చిరంజీవిని ఆ మాట నేనే అడిగాను: యండమూరి వీరేంద్రనాథ్

Yandamuri Interview

  • 'మంచుపల్లకి' సినిమాకి పనిచేసిన యండమూరి 
  • అప్పటి నుంచి చిరంజీవితో సాన్నిహిత్యం ఉందని వెల్లడి 
  • ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడోనని భయపడ్డానని వ్యాఖ్య 
  • తమ మధ్య మనస్పర్థలు లేవని వివరణ  


చిరంజీవికి .. యండమూరి వీరేంద్రనాథ్ కి మధ్య ఒకప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది. యండమూరి రాసిన ఛాలెంజ్ .. అభిలాష వంటి నవలలను సినిమాలుగా తీయగా చిరంజీవి హీరోగా నటించారు. అవి ఘన విజయాలను అందుకున్నాయి కూడా. అయితే ఆ మధ్య జరిగిన ఒక సంఘటన వాళ్ల మధ్య దూరం పెంచుతుందని అంతా భావించారు. తన జీవితచరిత్రను యండమూరి రాస్తారని మెగాస్టార్ ఇటీవల ఒక వేదికపై ప్రకటించడం అందరినీ ఆశ్ఛర్యపరిచింది. 

తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి యండమూరి ప్రస్తావించారు. 'మంచుపల్లకి' సినిమాకి నేను డైలాగ్స్ రాశాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక విభేదాలు భార్యాభర్తల మధ్య కూడా వస్తుంటాయి .. అలాంటివి వస్తూనే ఉంటాయి .. ఆ తరువాత కలిసిపోతూనే ఉంటాము. నాలుగేళ్ల తరువాత చిరంజీవి ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏమోనని నేను కాస్త భయపడ్డాను. కానీ ఆయన కళ్లలో అదే ప్రేమ కనిపించింది" అని అన్నారు. 

"ఆ రోజున ఆ వేదికపై నేనే అన్నాను 'మీ జీవిత చరిత్రను రాస్తే బాగుంటుందేమో' అని. ఆయన ఆనందాశ్చర్యాలకు లోనవుతూ, 'నిజంగా రాస్తారా .. నువ్వు రాస్తే అంతకంటే కావలసిందేముంటుంది? ఈ స్టేజ్ పై ఎనౌన్స్ చేయనా?" అని అన్నారు. అలా అక్కడ ఆ ప్రకటన చేయడం జరిగింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు" అని ఆయన చెప్పారు.

Yandamuri
Chiranjeevi
Tollywood
  • Loading...

More Telugu News