Kiran abbavaram: కిరణ్ అబ్బవరం నుంచి లవ్ స్టోరీగా 'దిల్ రుబా'

Dil Ruba Title Confirmed

  • వరుస సినిమాలతో హోరెత్తించిన కిరణ్ అబ్బవరం 
  • ఆయన తాజా చిత్రంగా సెట్స్ పై ఉన్న 'దిల్ రుబా'
  • కథానాయికగా మెరవనున్న రుక్సార్ థిల్లాన్ 
  • ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న రుక్సార్ థిల్లాన్

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఆయన తాజా చిత్రం ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ఇది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందుతోంది.

సరిగమ మ్యూజిక్ - శివమ్ సెల్యులాయిడ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో, విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కిరణ్ అబ్బవరం జోడీగా రుక్సార్ థిల్లాన్ అలరించనుంది. కృష్ణార్జున యుద్ధం .. అశోకవనంలో అర్జున కల్యాణం .. నా సామిరంగా సినిమాలతో తనకంటూ ఆమె ఒక గుర్తింపు తెచ్చుకుంది. 

నిన్నమొన్నటి వరకూ ఈ సినిమాకి టైటిల్ ను సెట్ చేయలేదు. తాజాగా ఈ సినిమాకి 'దిల్ రుబా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ యూత్ కి కనెక్ట్ అయ్యేలానే అనిపిస్తోంది. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం బలమైన నమ్మకంతో కనిపిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

More Telugu News