Gaami: ప్రయోగాలపై దృష్టిపెట్టిన విష్వక్సేన్!

Vishvak Sen Gaami Special

  • మాస్ రోల్స్ చేస్తూ వచ్చిన విష్వక్సేన్ 
  • మాస్ కా దాస్ గా యూత్ లో క్రేజ్ 
  • 'గామి'తో కొత్తగా ట్రై చేస్తున్న హీరో 
  • ఆసక్తిని పెంచుతున్న పోస్టర్స్


యువ హీరోల మధ్య ఇప్పుడు గట్టిపోటీ కనిపిస్తోంది. ఎవరికివారు తమ ప్రత్యేకతను చాటుకోవడానికి ట్రై చేస్తున్నారు. వైవిధ్యభరితమైన కథలు .. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కొత్తగా ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి విష్వక్సేన్ కూడా చేరిపోయాడు. అందుకు నిదర్శనమే ఆయన తాజా చిత్రం 'గామి' 

విష్వక్సేన్ మాస్ హీరోగానే తన కెరియర్ ను మొదలుపెట్టాడు. మాస్ కా దాస్ అనే ట్యాగ్ తోనే సినిమాలు చేస్తూ వెళ్లాడు. లవ్ .. రొమాన్స్ కలిగిన అంశాలను ఎంచుకున్నప్పటికీ, అసలు కథ మాస్ ట్రాక్ లోనే నడిచేది. అయితే తన రూట్ ను కాస్త మార్చుకుంటూ ఈ సారి ఆయన ఒక ప్రయోగానికి తెరతీశాడు. 'గామి' సినిమాలో అఘోరాగా కనిపించనున్నాడు. 

ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ను నిన్న వదిలారు. నాలుగేళ్లకు పైగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమాతో దర్శకుడిగా విద్యాధర్ పరిచయమవుతున్నాడనీ, అతను ఈ కథను డీల్ చేసిన తీరు తనకి బాగా నచ్చిందని అన్నాడు. చాలాకాలం తరువాత తనని తాను కొత్తగా చూసుకున్నాననీ, ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందని చెప్పాడు. ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందనేది చూడాలి. 

Gaami
Vishwak Sen
Vidyadhar
  • Loading...

More Telugu News