Baby John: వరుణ్ ధావన్ - కీర్తి సురేశ్ సినిమా టైటిల్ ఇదే!

Baby John Title Poster Released

  • వరుణ్ ధావన్ హీరోగా 'తెరి' రీమేక్ 
  • 'బాబీ జాన్' టైటిల్ ఖరారు చేసిన టీమ్ 
  • కీర్తి సురేశ్ కు హిందీలో ఫస్టు మూవీ 
  • మే 31వ తేదీన సినిమా రిలీజ్    


వరుణ్ ధావన్ - కీర్తి సురేశ్ జంటగా ఒక హిందీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి నిన్న మొన్నటి వరకూ కూడా టైటిల్ ను సెట్ చేయలేదు. వరుణ్ ధావన్ కి ఇది 18వ సినిమా .. అందువలన V18గానే ఈ ప్రాజెక్టును పేర్కొంటూ వచ్చారు. తాజాగా ఈ సినిమాకి 'బేబీ జాన్' అనే టైటిల్ ను ఖరారు చేసి .. టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

తమిళంలో విజయ్ చేసిన 'తెరి' సినిమాకి ఇది రీమేక్. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ జోడీగా సమంత నటించింది. అక్కడ ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అట్లీ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి కలీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. జాకీష్రాఫ్, రాజ్ పాల్ యాదవ్ కీలకమైన పాత్రలను పోషిస్తూ ఉండగా, వామికా గబ్బి ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కీర్తి సురేశ్ కి హిందీలో ఇదే మొదటి సినిమా. బలమైన కంటెంట్ కావడం వలన, హిందీలోను ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

More Telugu News