Ooru Peru Bhairavakona: 'భైరవకోన' భయపెడుతుంది: సందీప్ కిషన్

Sandeep Kishan Interview

  • సంజీవ్ కిషన్ నుంచి 'ఊరుపేరు భైరవకోన'
  • మిస్టిక్ విలేజ్ చుట్టూ తిరిగే యాక్షన్ అడ్వెంచర్ 
  • అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చుతుందన్న హీరో 
  • ఈ నెల 16వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా  


సందీప్ కిషన్ తాజా చిత్రంగా రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' .. ఒక్కో అప్ డేట్ తో అంచనాలు పెంచుతూ వెళుతోంది. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకి, వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగా 'గ్రేట్ ఆంధ్ర'తో సందీప్ కిషన్ మాట్లాడాడు. 

" ఈ కథ అంతా కూడా ఒక మిస్టీరియస్ గా అనిపించే ఒక విలేజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నేను బసవలింగం అనే పాత్రను పోషించాను. దొంగగా .. ఫైట్ మాస్టర్ గా కనిపిస్తాను. మిస్టిక్ థ్రిల్లర్ .. హారర్ అడ్వెంచర్ అనే జోనర్స్ ను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది. దేవుడు ... పురాణాల ప్రస్తావన కూడా ఉంటుంది. ఈ తరహా సినిమాలు నాకు చాలా ఇష్టం .. అందువల్లనే చేశాను" అని అన్నాడు. 

"ఈ సినిమా భయపెడుతుంది .. భయపడుతూనే చూడాలనిపించేలా ఉంటుంది. అలా అని ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూసే సినిమా కాదు ఇది. ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ ... ఎమోషన్ ... అడ్వెంచర్.. ఇలా ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. వీఐ ఆనంద్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తుంది.  ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పాడు. 

More Telugu News