Yamaleela: మహేశ్ తో ఆ సినిమా చేద్దామని అనుకున్నాను: ఎస్వీ కృష్ణారెడ్డి

SV Krishna Reddy Interview

  • కృష్ణ అంటే ఇష్టమన్న కృష్ణారెడ్డి
  • ఆయనకి 'యమలీల' కథను వినిపించానని వెల్లడి 
  • ఆ పాత్రకి మహేశ్ ఏజ్ సరిపోలేదని వ్యాఖ్య 
  • ఆ తరువాత ఆయన స్టార్ అయ్యాడని వివరణ


ఒకే సమయంలో దర్శకుడిగా .. సంగీత దర్శకుడిగా కూడా ఎస్వీ కృష్ణా రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక ఏడాదిలో వరుసగా మూడు హిట్లు ఇచ్చిన దర్శకుడు ఆయన. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన సినిమాలను గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

"మొదటి నుంచి కూడా కృష్ణగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా అందంగా ఉంటారు .. అందంగా నవ్వుతారు. ఆ ఇష్టంతోనే ఆయనతో 'నెంబర్ వన్' సినిమా చేశాను. నేను 'యమలీల' సినిమాను మహేశ్ బాబుతో చేయాలనుకున్నాను. కృష్ణగారికి కథ కూడా చెప్పాను. మహేశ్ ఆ కథకి సరిపోతాడో లేదో అనే విషయంలో క్లారిటీ కోసం ఆయన నన్ను చెన్నై రమ్మన్నారు" అని అన్నారు. 

"మహేశ్ బాబును చూడటం కోసం నేను వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పటికి మహేశ్ బాబు బొద్దుగా ఉన్నాడు. 'యమలీల' కథకి అతని వయసు సరిపోదని కృష్ణగారితో చెప్పాను. ఆ తరువాత నా సినిమాలతో నేను బిజీ అయ్యాను. మహేశ్ బాబు పెద్ద స్టార్ అయ్యాడు" అని చెప్పారు. 

Yamaleela
SV krishna Reddy
Mahesh Babu
Krishna
  • Loading...

More Telugu News