Joram: అమెజాన్ ప్రైమ్ లో ఉత్కంఠను రేకెత్తించే 'జొరామ్'

Joram Movie Update

  • మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రగా 'జొరామ్'
  • సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • డిసెంబర్ 8వ తేదీన విడుదలైన సినిమా 
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో

ఒక వైపున సినిమాలు ... మరో వైపున వెబ్ సిరీస్ లతో దూసుకుపోతూ మనోజ్ బాజ్ పాయ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆయన ఎంచుకుంటున్న కథలు .. పాత్రలు ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. ఆయన నటించిన 'జొరామ్' సినిమా, డిసెంబర్ 8వ తేదీన విడుదలైంది. విమర్శకుల నుంచి సైతం మంచి మార్కులు తెచ్చుకుంది. 

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. దేవాశిష్ మకీజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దాస్రు పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ .. వాన్నో పాత్రలో తనిష్ట ఛటర్జీ .. రత్నాకర్ పాత్రలో మహ్మద్ జషీన్ ఆయూబ్ కనిపించనున్నారు.

దాస్రు - వాన్నో భార్యాభర్తలు. ఒక గిరిజన గూడానికి చెందిన ఈ భార్యాభర్తలు, బ్రతకడం కోసం ముంబై వెళతారు. అక్కడ ఒక చోట కూలి పనికి కుదురుతారు. వాళ్ల జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ భార్యాబిడ్డలను చంపడానికి ప్రయత్నిస్తాడు. అందుకు కారణం ఏమిటి? అతని బారినుంచి వాళ్లు తప్పించుకోగలుగుతారా? అనేదే కథ.

Joram
Manoj Bajpayee
Tannishtha Chatterjee
Mohammed Zeeshan Ayyub
  • Loading...

More Telugu News