Upasana: హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీ, తన పొలిటికల్ ఎంట్రీపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు!

Konidela Upasana gives clarity on her political entry

  • ప్రజలకు సేవ చేసేందుకు విజయ్ ముందుకు రావడం సంతోషకరమన్న ఉపాసన
  • సమాజంలో మార్పు రావాలనుకుంటే లీడర్ ఎవరనేది చూడకుండా సపోర్ట్ చేయాలని సూచన
  • తాను రాజకీయాల్లోకి రానని స్పష్టీకరణ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందిస్తూ... ఒక నటుడిగా విజయ్ ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారని... ఇది చాలా గొప్ప విషయమని చెప్పారు. 

అందరికీ తాను ఒకటే చెప్పాలనుకున్నానని... సమాజంలో మార్పు రావాలని కోరుకుంటే లీడర్ ఎవరనేది చూడకుండా సపోర్ట్ చేయాలని ఉపాసన అన్నారు. ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా వెనక్కి మాత్రం లాగొద్దని చెప్పారు. కొత్త నాయకుడికి మద్దతుగా నిలిచినప్పుడే సమాజంలో మనం కోరుకునే మార్పు వస్తుందని అన్నారు. తమిళనాడులో కూడా మార్పు వస్తుందనే ఆశాభావం తనకు ఉందని చెప్పారు. 

మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా... తాను పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే, మార్పు తీసుకొచ్చే నాయకుడికి మాత్రం తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.

Upasana
Actor Vijay
Political Party
Politics
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News