Ayalaan: ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న 'అయలాన్'

Ayalaan OTT release date confirmed

  • జనవరి 12న విడుదలైన 'అయలాన్'
  • ఏలియన్ నేపథ్యంలో నడిచే కథ 
  • శివకార్తికేయన్ జోడీకట్టిన రకుల్ ప్రీత్ 
  • తమిళనాట హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ
  • ఈ నెల 9 నుంచి సన్ నెక్స్ట్ లో  


శివ కార్తికేయన్ హీరోగా 'అయలాన్' సినిమా రూపొందింది. ఏలియన్ నేపథ్యంలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. జనవరి 12వ తేదీన ఈ సినిమా తమిళనాట విడుదలైంది. ఈ సినిమా ధనుశ్ 'కెప్టెన్ మిల్లర్' ను మించిన వసూళ్లను రాబట్టడం విశేషం. చాలా వేగంగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా తెలుగులోను సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శివకార్తికేయన్ సరసన రకుల్ నటించింది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చడం విశేషం.

ఈ సినిమాలో హీరో ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు. అతనికి మూగజీవాలంటే ఎంతో ప్రేమ. సేంద్రియ ఎరువులతో పంట పండించే అతనికి నష్టాలే మిగులుతాయి. దాంతో బ్రతకడం కోసం అతను పట్నం వెళతాడు. ఒక కారణంగా భూమి మీదకి వచ్చిన ఒక ఏలియన్ తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఫలితంగా ఏం జరుగుతుందనేదే కథ. 

Ayalaan
ShivaKarthikeyan
Rakul Preet Singh
Ravi Kumar
  • Loading...

More Telugu News