Amit Shah: మయన్మార్ తో సరిహద్దు పొడవునా ఫెన్సింగ్ నిర్మిస్తాం: అమిత్ షా

Amit Shah says fencing will be established entire boarder with Myanmar

  • మయన్మార్ లో హింస... భారత్ లో ప్రవేశించిన మయన్మార్ సైనికులు
  • కంచె వేస్తామని ప్రకటించిన కేంద్రం
  • 1,643 కిలోమీటర్ల మేర కంచెను వేస్తామన్న అమిత్ షా
  • హైబ్రిడ్ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని వెల్లడి

మయన్మార్ లో హింస కారణంగా ఆ  దేశానికి చెందిన సైనికులు ఇటీవల భారత్ లో ప్రవేశించడం తెలిసిందే. ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిర్మించినట్టే మయన్మార్ సరిహద్దుల్లోనూ ఇనుప కంచె నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్  షా ఆ ఘటన జరిగిన వెంటనే ప్రకటించారు. 

ఇప్పుడా అంశంపై అమిత్ షా మరింత స్పష్టతనిచ్చారు. చొరబాటుదారులు ప్రవేశించడానికి వీల్లేని విధంగా భారత్-మయన్మార్ సరిహద్దుల పొడవునా మొత్తం 1,643 కిలోమీటర్ల మేర పటిష్ఠమైన ఫెన్సింగ్ నిర్మిస్తామని వెల్లడించారు. దేశ భద్రతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

మణిపూర్ లో సరిహద్దు ప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర కంచెను విజయవంతంగా నిర్మించినట్టు తెలిపారు. ఈ కంచె పొడవునా అధునాతన నిఘా వ్యవస్థలు (హైబ్రిడ్ సర్విలెన్స్ సిస్టమ్) ఏర్పాటు చేస్తామని వివరించారు.

More Telugu News