Bandi Sanjay: ఈ నెల 10 నుంచి బండి సంజయ్ యాత్ర

Bandi Sanjay yatra begins on Feb 10

  • కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో సంజయ్ యాత్ర
  • విజయ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర
  • లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగనున్న యాత్ర

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎంపీ బండి సంజయ్ ఈ నెల 10 నుంచి యాత్ర చేపట్టబోతున్నారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో సంజయ్ యాత్ర చేస్తారు. లోక్ సభ ఎన్నికలు జరిగేంత వరకు ఆయన యాత్ర కొనసాగనుంది. 10వ తేదీన కొండగట్టు వద్ద పూజ చేసి, మేడిపల్లి నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో యాత్ర ముగుస్తుంది.

Bandi Sanjay
BJP
Yatra
TS Politics
  • Loading...

More Telugu News