EMCET 2024: తెలంగాణ ఎప్‌సెట్-2024 షెడ్యూల్ విడుదల

Telangana EMCET 2024 schedule release

  • ఫిబ్రవరి 26న మొదలై ఏప్రిల్ 6న ముగియనున్న దరఖాస్తులు
  • మే 9 - 12 తేదీల మధ్య పరీక్షల నిర్వహణ
  • షెడ్యూల్ వివరాలను వెల్లడించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి

తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. టీఎస్ ఎప్‌సెట్-2024 (EAPCET2024) (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) షెడ్యూల్ 2024ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 26న మొదలై ఏప్రిల్ 6న ముగుస్తుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మే 9 -12వ తేదీల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం పరీక్షలను జేఎన్‌టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ నిర్వహించనుందని ఆయన వివరించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్టు తెలిపారు. కాగా మెడిసిన్ సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘ఎం’ అక్షరాన్ని ఎంసెట్ (EAMCET) నుంచి తొలగించారు. దీంతో ఎంసెట్ పేరు ‘ఎప్‌సెట్‌’గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాల కోసం మాత్రమే ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

EMCET 2024
EMCET 2024 schedule
Telangana EMCET
Telangana
Education
  • Loading...

More Telugu News