Poonam Pandey: క్యాన్సర్ తో చనిపోయినట్టు ప్రాంక్ చేసిన పూనమ్ పాండేకు కోర్టు నోటీసులు

Court notice to Poonam Pandey

  • గర్భాశయ క్యాన్సర్ తో పూనమ్ పాండే చనిపోయినట్టు వార్తలు
  • తాను చనిపోలేదంటూ తర్వాతి రోజు పూనమ్ పాండే ప్రకటన
  • గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కలిగించేందుకు అలా చేశానని వెల్లడి
  • కోర్టు ద్వారా నోటీసులు పంపిన కోల్ కతా వాసి అమిత్ రాయ్

ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్టు ఇటీవల వార్తలు రావడం, అందరూ అయ్యో పాపం అనడం, ఆ మర్నాడు తాను చనిపోలేదని, గర్భాశయ క్యాన్సర్ పై అందరిలోనూ అవగాహన పెంచేందుకే ఇలా చేశానని పూనమ్ పాండే వివరణ ఇవ్వడం తెలిసిందే. పూనమ్ పాండే చర్యలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఆమె పబ్లిసిటీ కోసమే ఇలా చేసిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే, కోల్ కతాకు చెందిన అమిత్ రాయ్ అనే వ్యక్తి పూనమ్ పాండేకు కోర్టు ద్వారా నోటీసులు పంపారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అని, అలాంటి ప్రకటన ద్వారా పూనమ్ పాండే తీవ్ర గందరగోళం సృష్టించారని అమిత్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూనమ్ పాండే మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Poonam Pandey
Prank
Survical Cancer
Death
Court
Kolkata
  • Loading...

More Telugu News