Kaatera: ఓటీటీలోకి అడుగుపెడుతున్న సంచలనం .. 'కాటేరా'

Kaatera Movie Update

  • కన్నడలో హిట్ కొట్టిన 'కాటేరా'
  • 200 కోట్లకి పైగా రాబట్టిన వసూళ్లు
  • హీరోయిన్ గా ఆరాధన రామ్ ఎంట్రీ 
  • ఈ నెల 9వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్  


కన్నడలో దర్శన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన హీరోగా రూపొందిన 'కాటేరా' డిసెంబర్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఏడాది చివర్లో వచ్చినప్పటికీ, క్రితం ఏడాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 'సలార్' బరిలో ఉండగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం విశేషం. 

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా జగపతిబాబు నటించడం విశేషం. 

ఈ సినిమా కథ 1970లలో నడుస్తూ ఉంటుంది. కథాకథనాలు .. దర్శన్ పాత్రలోని వేరియేషన్స్ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. మాలాశ్రీ కూతురు 'ఆరాధన రామ్' ఈ సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఇక మరో ముఖ్యమైన పాత్రలో వినోద్ కుమార్ నటించాడు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి.

Kaatera
Darshan
Aradhana Ram
Jagapathi Babi
  • Loading...

More Telugu News