Trisha: సీనియర్ భామలను కలవర పెడుతున్న త్రిష!
![Trisha Special](https://imgd.ap7am.com/thumbnail/cr-20240206tn65c1bf5fc4679.jpg)
- పాతికేళ్ల కెరియర్ చూసిన త్రిష
- తరగని అందంతో పెరిగిన క్రేజ్
- సౌత్ లో మళ్లీ బిజీ అవుతున్న బ్యూటీ
- 'విశ్వంభర'లో ప్రధాన కథానాయిక ఆమెనే
అందంగా ఉండటం వేరు ... అందాల కథానాయిక అనిపించుకోవడం వేరు. అందంగా ఉన్నవాళ్లంతా కథానాయికలుగా ఏలేస్తారనే గ్యారంటీ లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే అందంతో పాటు అభినయం .. అందుకు అవసరమైన అదృష్టం ఉండాల్సిందే. ఎంత గ్లామరస్ గా కనిపించినా హీరోయిన్ గా తెరపై కనిపించేది కొంతకాలమే అనేది అందరికీ తెలిసిందే. అయితే కెరియర్ మొదలెట్టి పాతికేళ్లు అవుతున్నా స్టార్ డమ్ తగ్గకపోవడం త్రిష లాంటి కొంతమంది విషయంలోనే జరుగుతుంది.
![](https://img.ap7am.com/froala-uploads/20240206fr65c1bf49b80f6.jpg)
అలాంటి త్రిషకి 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఛాన్స్ వచ్చింది. అటు ఆ సినిమాలోను .. ఆ సినిమా వేడుకలలోను త్రిష గ్లామర్ చూసి షాక్ కానివారంటూ లేరు. తెరపై ఆమె ముత్యంలా మెరిసింది .. ముద్దబంతిలా విరిసింది. అప్పటి నుంచి అంతా ఆమె గ్లామర్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. వివిధ భాషలలోని సీనియర్ స్టార్స్ సినిమాల నుంచి ఆమెను సంప్రదించడం మొదలైంది. ప్రస్తుతం ఆమె తమిళ .. మలయాళ సినిమాలతో బిజీగా ఉంది.
![](https://img.ap7am.com/froala-uploads/20240206fr65c1bf59a730e.jpg)