Nagababu: మెగా డీఎస్సీ పేరిట దగా... 30 వేల పోస్టులుంటే 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఏంటి?: నాగబాబు

Nagababu questions CM Jagan on Mega DSC

  • 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం
  • రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో నాగబాబు సమావేశం
  • ఎన్నికల సమయంలో నిరుద్యోగులను మరోసారి మోసం చేస్తున్నారని ఆగ్రహం
  • పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది జగన్ గారూ? అంటూ ప్రశ్నించిన నాగబాబు

ఏపీ క్యాబినెట్ ఇటీవల 6,100 టీచర్ పోస్టులతో డీఎస్సీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. ఇవాళ మంగళగిరి జనసేన కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో నాగబాబు సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేరిట వైసీపీ దగా చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 25 నుంచి 30 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిరుద్యోగులపై జగన్ సర్కారుకు నిజమైన ప్రేమ ఉంటే 30 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నాగబాబు డిమాండ్ చేశారు. 23 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ అంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది జగన్ గారూ? అంటూ నిలదీశారు.

  • Loading...

More Telugu News