Hyderabad: పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్... విచారిస్తున్న పోలీసులు

Hyderabad police arrested former CI Durga Rao
  • మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో సస్పెండైన దుర్గారావు
  • ఈ కేసులో ఏ11గా దుర్గారావు
  • గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు?
సస్పెండైన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు ఏ11గా ఉన్నాడు. ఆయన వారం రోజులుగా పరారీలో ఉన్నాడు.

అయితే ఆయనను ఆదివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్‌కు తీసుకువచ్చి... వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం దుర్గారావు హైకోర్టును ఆశ్రయించాడు.
Hyderabad
durga rao
ci

More Telugu News