Manikandan: ప్రేమికుల రోజు సందర్భంగా 'ట్రూ లవర్'

Tru Lover Movie Update

  • ప్రేమకథా చిత్రంగా 'ట్రూ లవర్'
  • 'గుడ్ నైట్'తో క్రేజ్ తెచ్చుకున్న మణికందన్ 
  • ఆయన సరసన నాయికగా గౌరీప్రియ
  • ఈ నెల 10వ తేదీన సినిమా విడుదల  


వాలెంటైన్స్ డే సందర్భంగా యూత్ ను పలకరించడానికి ప్రేమకథా చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలోనే తమిళ సినిమా 'ట్రూ లవర్' చేరిపోయింది. మాణికందన్ - గౌరీ ప్రియ జంటగా ఈ సినిమా రూపొందింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఇదే టైటిల్ తో ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. 

మణికందన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. అందుకు కారణం ఓటీటీలో దూసుకుపోయిన 'గుడ్ నైట్' సినిమా. ఈ సినిమాలో 'గురక' సమస్యతో సతమతమయ్యే పాత్రలో అతని నటన ఆకట్టుకుంటుంది. ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మేకర్స్ .. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో దింపేస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రేమ అంటే లవర్స్ మధ్య అలకలు .. బుజ్జగింపులు ... ఊహలు .. ఉద్వేగాలు ... వినోదాలు .. విరహాలు సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సన్నివేశాలపైనే ఈ సినిమా ట్రైలర్ ను కట్ చేశారు. ఇక గౌరీప్రియ 'రైటర్ పద్మభూషణ్' .. 'మ్యాడ్' సినిమాలతో ఇక్కడి ఆడియన్స్ కి తెలుసు. ఈ సినిమా ఇక్కడ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.

More Telugu News