AP Assembly Session: అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు

TDP MLAs walkout form Assembly

  • గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై టీడీపీ సభ్యుల అభ్యంతరం
  • సార్.. మీతో అబద్ధాలు చెప్పిస్తున్నారంటూ నిరసన
  • నినాదాల మధ్యే ప్రసంగాన్ని కొనసాగించిన గవర్నర్

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్.. మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు. 

విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. 

AP Assembly Session
Telugudesam
MLAs Walk OUT
  • Loading...

More Telugu News