Telangana: తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్లలో ఇక 'టీఎస్' కాదు... 'టీజీ'

Telangana cabinet decisions annouced

  • నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు
  • తెలంగాణలో కులగణనకు నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటిరకు నెంబరుకు ముందు రాష్ట్రం పేరును సూచించేలా టీఎస్ (TS) అనే అక్షరాలు ఉండేవి. ఇప్పుడు 'టీఎస్' అనే అక్షరాలు కనుమరుగు కానున్నాయి. టీఎస్ స్థానంలో ఇకపై టీజీ (TG) అనే అక్షరాలు రానున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

అంతేకాదు, పలు కీలక నిర్ణయాలకు నేటి క్యాబినెట్ సమావేశం వేదికగా నిలిచింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అధికారిక గీతంగా 'జయ జయహే తెలంగాణ'ను ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ ఆత్మ, స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. 

ఆరు గ్యారెంటీలపై లోతుగా చర్చించిన అనంతరం రెండు గ్యారెంటీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించారు.
 

Telangana
Cabinet
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News