Shubhman Gill: శుభ్ మాన్ గిల్ సెంచరీపై సచిన్ స్పందన

Sachin Tendulkar responds on Shubhman Gill century

  • ఫామ్ లో లేక తంటాలు పడిన గిల్
  • నేడు ఇంగ్లండ్ పై సెంచరీతో మళ్లీ టచ్ లోకి వచ్చిన యువ బ్యాటర్
  • గిల్ ఇన్నింగ్స్ పూర్తి నైపుణ్యంతో కొనసాగిందన్న సచిన్ 
  • సరైన సమయంలో సెంచరీ కొట్టాడని కితాబు

ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ బ్యాట్స్ మన్ శుభ్ మాన్ గిల్ ఇంగ్లండ్ తో రెండో టెస్టులో సెంచరీ ద్వారా మళ్లీ టచ్ లోకి వచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో గిల్ 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 104 పరుగులు చేశాడు. 

ఈ నేపథ్యంలో, గిల్ సెంచరీపై భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. "సరైన సమయంలో సెంచరీ కొట్టినందుకు శుభాభినందనలు. ఈ ఇన్నింగ్స్ లో శుభ్ మాన్ గిల్ బ్యాటింగ్ పూర్తి నైపుణ్యంతో కొనసాగింది" అంటూ కొనియాడాడు. 

కాగా, శుభ్ మాన్ గిల్... సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ తో డేటింగ్ లో ఉన్నాడని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.  ఇటీవల సారా, గిల్ సోదరి ఒకే కారులో కనిపించడం ఊహాగానాలకు బలం చేకూర్చింది.

Shubhman Gill
Century
Sachin Tendulkar
Team India
England
2nd Test
Visakhapatnam
  • Loading...

More Telugu News