Yatra-2: జగన్ పవర్ ఫుల్ డైలాగ్ తో యాత్ర-2 ట్రైలర్ రిలీజ్

Yatra 2 trailer out now

  • వైఎస్సార్ మరణం, తదనంతర పరిస్థితుల ఆధారంగా యాత్ర-2 చిత్రం
  • ప్రధానపాత్రల్లో మమ్ముట్టి, జీవా... మహీ వి రాఘవ్ దర్శకత్వం
  • ఫిబ్రవరి 8న రిలీజ్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా, తమిళ హీరో జీవా వైఎస్ జగన్ గా నటిస్తున్న చిత్రం యాత్ర-2. మహీ వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో వచ్చిన వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర' చిత్రానికి ఇది సీక్వెల్. తాజాగా, యాత్ర-2 చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. 

వైఎస్సార్ మరణం, తదనంతర రాజకీయ పరిస్థితులు, జగన్ కాంగ్రెస్ ను వీడి నూతన పార్టీ ఏర్పాటు చేయడం, జైలు జీవితం, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం తదితర అంశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ఓ అంధుడితో మాట్లాడుతూ... నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జగన్ పాత్రధారి జీవా పలికిన డైలాగ్ భావోద్వేగభరితంగా ఉంది. యాత్ర-2 చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News