Whatsapp: భారత్ లో 69 లక్షలకు పైగా సమస్యాత్మక ఖాతాలపై వాట్సాప్ నిషేధం

Whatsapp bans 69 lakh accounts in India

  • భారత్ లో వాట్సాప్ కు 50 కోట్ల యూజర్లు
  • డిసెంబరులో వాట్సాప్ కు రికార్డు స్థాయిలో 16,366 ఫిర్యాదులు
  • కేంద్ర ప్రభుత్వ ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఖాతాలపై వాట్సాప్ చర్యలు

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై వేటు వేసింది. సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించిన 69 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ గత డిసెంబరులో నిషేధించింది. ఈ ఖాతాలు భారత కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు వాట్సాప్ గుర్తించింది. 

2023 డిసెంబరు 1 నుంచి 31వ తేదీ మధ్య 69,34,000 ఖాతాలపై వాట్సాప్ తొలుత ఆంక్షలు విధించింది. వాటిలో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా, నేరుగా నిషేధం విధించింది. డిసెంబరులో వాట్సాప్ కు రికార్డు స్థాయిలో 16,366 ఫిర్యాదులు అందాయి. 

అంతకుముందు, నవంబరులోనూ భారత్ లో 71 లక్షల సమస్యాత్మక ఖాతాలపై వాట్సాప్ వేటు వేసింది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు చెందిన వాట్సాప్ కు భారత్ లో 50 కోట్ల యూజర్లు ఉన్నారు.

Whatsapp
Accounts
Ban
India
  • Loading...

More Telugu News