Sandeep Vanga: ఆమిర్ ఖాన్ మాజీ భార్యపై దర్శకుడు సందీప్ వంగా విమర్శలు

Director Sadeep Vanga comments on Aamir Khan ex wife Kiran Rao

  • 'యానిమల్' చిత్రంపై కిరణ్ రావు విమర్శలు
  • స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉందని వ్యాఖ్య
  • మీ మాజీ భర్త ఆమిర్ చిత్రం 'దిల్' గురించి ఆయనను అడగాలన్న సందీప్ వంగా

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో శృగారం, హింస ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ట్రోల్స్ ఆగడం లేదు. 

తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు విమర్శలు గుప్పించారు. 'బాహుబలి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలు స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై సందీప్ వంగా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 

కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలను తాను విన్నానని... ఆమెకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని... ఆమె మాజీ భర్త ఆమిర్ ఖాన్ చిత్రం 'దిల్' గురించి ఆయనను అడగమనండి అని సందీప్ వంగా చెప్పారు. ఆ చిత్రంలో హీరోయిన్ ను రేప్ కు ప్రేరేపించేలా హీరో చేస్తాడని... ఆ తర్వాత ఆమే తప్పు చేసిందని నమ్మిస్తాడని, చివరకు ఆమె హీరోనే ప్రేమిస్తుందని తెలిపారు. ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే తమపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు.

More Telugu News