Bike Accident: వనస్థలిపురంలో బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. ఇద్దరి మృతి

Fatal Accident In Hyderabad VanasthaliPuram

  • శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం
  • కూకట్ పల్లికి చెందిన ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
  • ఇటుక లోడ్ ఖాళీ చేయడానికి వెళ్లి మృత్యువాత

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో అదుపుతప్పిన ఓ టిప్పర్ విధ్వంసం సృష్టించింది. ఓ బైక్ ను వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు..

కూకట్ పల్లికి చెందిన సతీశ్, వీరబాబు వనస్థలిపురంలో ఇటుక లోడ్ ఖాళీ చేయడానికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా సుష్మా థియేటర్ సమీపంలో ఓ టిప్పర్ వీరి బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు యువకులు ఇద్దరూ ఎగిరిపడగా.. టిప్పర్ ముందు టైర్లు బైక్ పైకెక్కాయి. దీంతో తీవ్రగాయాలపాలైన సతీశ్, వీరబాబు స్పాట్ లోనే కన్నుమూశారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Bike Accident
Tipper
Vanasthalipuram
Hyderabad
Road Accident
Two Dead
  • Loading...

More Telugu News