Mohan Babu: గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించడంపై మోహన్ బాబు స్పందన

Mohan Babu response on Gaddar Awards

  • గద్దర్ పేరిట రాష్ట్ర అవార్డులను ప్రకటించిన రేవంత్ రెడ్డి
  • సమాజంలో మార్పుకు గద్దర్ పాటలు ఎంతో దోహదపడ్డాయన్న మోహన్ బాబు
  • ఈ అవార్డులు గద్దర్ కృషి, త్యాగాలకు గొప్ప గౌరవమని వ్యాఖ్య

ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరిట రాష్ట్ర అవార్డులను అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై సినీ నటుడు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... సంస్కృతిని గుర్తించడంపై వారికున్న నిబద్ధతకు ఇదొక నిదర్శనమని కొనియాడారు. 

గద్దర్ పాటలు సమాజంలో మార్పును తీసుకొచ్చేందుకు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. గద్దర్ అవార్డులను ఇవ్వడం... సంగీతం, పాటల ద్వారా సమాజ మార్పు కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలకు గొప్ప గౌరవమని అన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకొక గొప్ప అనుభూతి అని చెప్పారు. గతంలో గద్దర్ కు శాలువా కప్పి సత్కరిస్తున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. 

Mohan Babu
Gaddar
Tollywood
Revanth Reddy
Congress
Gaddar Awards
  • Loading...

More Telugu News