Lal Salaam: మరో ఎనిమిది రోజుల్లో మోడ్రన్ భాయ్ వచ్చేస్తున్నాడు!

Lal Salaam set to release on Feb 9

  • రజనీకాంత్ ప్రధానపాత్రలో లాల్ సలామ్
  • మొయిద్దీన్ భాయ్ గా కనిపించనున్న రజనీకాంత్
  • లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో చిత్రం 
  • ఫిబ్రవరి 9న విడుదల  

తలైవా రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్ గా కీలకపాత్ర పోషించిన చిత్రం లాల్ సలామ్. ఇందులో ఆయన మోడ్రన్ భాయ్ తరహాలో అలరించనున్నారు. లాల్ సలామ్ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్, అనంతిక తదితరులు నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించడం ఓ ముఖ్య ఆకర్షణ కానుంది. విడుదల తేదీ దగ్గరపడడంతో లాల్ సలామ్ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్లు అభిమానులను విశేషంగా అలరించాయి. రజనీకాంత్ పాత్రను ఎలా తీర్చిదిద్దారన్నది అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల రజనీ జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో, ఆయన అభిమానులు మాంచి జోష్ తో ఉన్నారు. ఇప్పుడీ లాల్ సలామ్ కూడా వారి అంచనాలను అందుకుంటే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ ఖాయం. 

Lal Salaam
Rajinikanth
Aishwarya Rajinikanth
Lyca Productions
Kollywood
  • Loading...

More Telugu News