Chiranjeevi: కొత్త చిత్రం కోసం జిమ్ లో చెమటోడ్చుతున్న చిరంజీవి... వీడియో ఇదిగో!

Chiranjeevi hits the gym very hard for his 156th movie

  • మెగాస్టార్ కొత్త చిత్రం 'విశ్వంభర'
  • యువ దర్శకుడు వశిష్ఠకు చాన్స్
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న చిరంజీవి
  • సరికొత్త మేకోవర్ కోసం జిమ్ బాట పట్టిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సరికొత్త చిరంజీవిని చూస్తారని చిత్రబృందం చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే చిరంజీవి జిమ్ లో చెమటోడ్చుతున్నారు. 

తాజాగా, జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నద్ధమవుతున్నా... రంగంలోకి దిగేందుకు అమితాసక్తితో ఉన్నా అంటూ ట్వీట్ చేశారు. 

'విశ్వంభర' చిరంజీవి కెరీర్ లో 156వ చిత్రం. ఇందులో ఆయన పాత్ర పేరు భీమవరం దొరబాబు. గతేడాది నవంబరులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే చిరంజీవి కూడా సెట్స్ పైకి వెళ్లనున్నారు. 'విశ్వంభర' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్రబృందం ప్రణాళిక. 'విశ్వంభర' సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Chiranjeevi
Viswambhara
Vashishta
Gym
UV Creations
Andhra Pradesh

More Telugu News