Keerthi Suresh: అందం తెచ్చిన కీర్తి కిరీటం .. కీర్తి సురేశ్ లేటెస్ట్ పిక్స్!

- తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ జోరు
- క్రితం ఏడాది రెండు హిట్లు కొట్టిన బ్యూటీ
- ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ
- ఎల్లో చీరకట్టులో ఎల్లోరా శిల్ప దర్శనం
చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ ను మొదలుపెట్టి, ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగినవారి జాబితాలో శ్రీదేవి .. మీనా తరువాత స్థానంలో కీర్తి సురేశ్ కనిపిస్తుంది. మలయాళ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన కీర్తి సురేశ్, ప్రస్తుతం తెలుగు .. తమిళ .. మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. నేను .. శైలజ, నేను లోకల్ .. మహానటి వంటి హిట్ సినిమాలు ఆమె కెరియర్లో ఉన్నాయి.


