Commercial LAP Cylinder: కేంద్ర బడ్జెట్ కు ముందు పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు

Commercial LPG cylinder rate hiked

  • 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు
  • ఒక్కో సిలిండర్ పై రూ. 14 పెంపు
  • డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర యథాతథం

కాసేపట్లో కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి చరిత్రపుటల్లోకి ఎక్కబోతున్నారు. ఈ బడ్జెట్ లో ఎన్నికల తాయిలాలు ఉండే అవకాశం ఉంది. 

మరోవైపు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు... ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్ పై రూ. 14 పెంచారు. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,769.50కి చేరుకుంది. స్థానిక పన్నులను బట్టి ఈ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పటి నుంచి సిలిండర్ బుక్ చేసుకునే వారు పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను చివరిసారిగా మార్చ్ 1వ తేదీన మార్చారు.

Commercial LAP Cylinder
Rate
Hike
  • Loading...

More Telugu News