Jr NTR: దిల్ రాజు సోదరుడి ఇంట పెళ్లి బాజాలు... జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం

Dil Raju family invites Jr NTR to Ashish Reddy marriage
  • శిరీష్ తనయుడు ఆశిష్ కు త్వరలో వివాహం
  • ఎన్టీఆర్ ను కలిసి పెళ్లి కార్డు అందించిన దిల్ రాజు
  • ఆశిష్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్రమంలో, తన సోదరుడి కుమారుడి పెళ్లికి రావాలంటూ దిల్ రాజు స్వయంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. నేడు దిల్ రాజు, ఆయన కుమార్తె హన్షితా రెడ్డి, శిరీష్, ఆశిష్ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వచ్చారు. ఎన్టీఆర్ కు పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆశిష్ కు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆశిష్ రెడ్డి గతంలో రౌడీ బాయ్స్ అనే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. కాగా, ఆశిష్ ఓ ఆంధ్రా వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లాడబోతున్నట్టు తెలుస్తోంది. డిసెంబరులో నిశ్చితార్థం జరగ్గా... పెళ్లి ఫిబ్రవరిలో జరపనున్నట్టు సమాచారం.
Jr NTR
Dil Raju
Sirish
Ashish Reddy
Wedding
Tollywood

More Telugu News