Prashanth Varma: సక్సెస్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Prashanth Varma Interview

  • ఈ నెల 12వ తేదీన విడుదలైన 'హను మాన్'
  • భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతున్న సినిమా
  • ఇంతటి హిట్ ఊహించలేదన్న డైరెక్టర్  
  • ఇదంతా హనుమంతుడు చేసిన మేజిక్కని వ్యాఖ్య


ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హను మాన్' సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్ల దిశగా దూసుకుపోయింది. ఈ సినిమా సక్సెస్ టాక్ తరువాత కూడా ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలతో బిజీగానే ఉన్నాడు. తాజాగా ఆయన 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి మాట్లాడాడు.

"టీజర్ ... ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ సమయానికి థియేటర్లు పెద్దగా దొరకలేదు. దాంతో ఈ సినిమాను తప్పకుండా హిట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆడియన్స్ వచ్చారు .. వచ్చిన తరువాత కనెక్ట్ అయ్యారు. నార్త్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఈ సినిమా ఒక్కోరోజు ఒక్కో రికార్డును క్రియేట్ చేస్తుంటే, నాకు ఇదంతా ఒక కలగా అనిపించేది" అన్నాడు. 

"ఈ సినిమా ఒక స్థాయిని దాటేసిన తరువాత మాత్రం, ఇదంతా హనుమంతుడే చేయిస్తున్నాడనే ఒక నమ్మకం కలిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత సింగీతం శ్రీనివాసరావుగారు కాల్ చేసి, సక్సెస్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టమని చెప్పారు. ఆయన అలా ఎందుకన్నారనేది నాకు ఆ తరువాత అర్థమవుతూ వస్తోంది" అని చెప్పాడు. 

More Telugu News