Aanaswara Rajan: 'నెరు' సినిమాకి ప్రధానమైన బలం .. ప్రత్యేకమైన ఆకర్షణ .. అనశ్వర రాజన్!

Aanaswara Rajan Special

  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'నెరు'
  • ప్రధానమైన పాత్రను పోషించిన అనశ్వర రాజన్ 
  • ఆడియన్స్ ను కట్టిపడేసే సహజమైన నటన 
  • ప్రముఖుల నుంచి లభిస్తున్న ప్రశంసలు
  • యూత్ లో మరింత పెరిగిన క్రేజ్    


మలయాళంలో ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'అనశ్వర రాజన్'. కేరళలోని 'కరివెల్లూర్'లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ, టీనేజ్ లోనే మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టీనేజ్ లవ్ స్టోరీస్ లో యూత్ నుంచి మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది. అక్కడి కుర్ర హీరోలకు ఫస్టు ఆప్షన్ గా ఆమె నిలిచింది. నటన పరంగా ఆమె గెలుచుకున్న బహుమతులు కూడా అనేకం.మలయాళంలో ఇటీవల వచ్చిన 'నెరు' సినిమా, ఆమె కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నటన పరంగా ఆమెపై ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర ఆమెదే. ఆమె పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఆమె అంధురాలి పాత్రలో కనిపిస్తుంది. చూపులేని యువతినే ఆ పాత్రకి తీసుకున్నారేమో అనేంత సహజంగా ఆమె నటించింది. మోహన్ లాల్ తో కలిసి నటించడమంటే అది అంత తేలికైన విషయమేం కాదు. అయినా ఆమె పాత్ర మోహన్ లాల్ తోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. స్క్రీన్ పై ఉన్న తనవైపుకి ఆడియన్స్ దృష్టిని మళ్లించడంలో ఆమె సక్సెస్ అయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులను ఆమె పాత్ర ... ఆమె నటన తప్పకుండా ప్రభావితం చేస్తాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 'హాట్ స్టార్' లో అందుబాటులో ఉంది. 

Aanaswara Rajan
Actress
Neru Movie
Mohanlal
  • Loading...

More Telugu News