IKEA: వరల్డ్ ఫేమస్ ఐకియా ఫర్నిచర్ ఇక ఇంటి వద్దకే డెలివరీ

IKEA store starts home delivery

  • 2018లో హైదరాబాదులో ఐకియా స్టోర్ ప్రారంభం
  • పొరుగు రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ స్టోర్ కు వినియోగదారుల రాక
  • ప్రజాదరణ నేపథ్యంలో హోమ్ డెలివరీ ప్రారంభించిన ఐకియా
  • 7,500 రకాల ఫర్నిచర్ ఐటమ్ లతో ఈ-కామర్స్ సేవలు

ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ సంస్థ ఐకియా హైదరాదులోనూ షోరూమ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని వేల రకాల ఫర్నిచర్ ఐటమ్ లు ఐకియా స్టోర్ లో లభ్యమవుతాయి. స్వీడన్ కు చెందిన ఈ ఫర్నిచర్ దిగ్గజం 2018లో హైదరాబాదులో కాలుమోపింది. హైదరాబాద్ వాసులే కాదు, పొరుగు రాష్ట్రాల వారు కూడా ఇక్కడి స్టోర్ ను సందర్శిస్తుంటారు. 

ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఐకియా హైదరాబాద్ స్టోర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు హోమ్ డెలివరీ ఇవ్వాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లోని 62 జిల్లాలకు ఇంటి వద్దకే డెలివరీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఐకియా నేడు వెల్లడించింది. 

ఐకియా ఈ-కామర్స్ ద్వారా 7,500 ఉత్పత్తులకు ఈ హోమ్ డెలివరీ సదుపాయం వర్తిస్తుంది. వినియోగదారులు ఐకియా యాప్, ఐకియా వెబ్ సైట్, ఫోన్ షాపింగ్ ద్వారా ఐకియా ఈ-కామర్స్ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫలానా ప్రాంతానికి హోమ్ డెలివరీ ఉంటుందా, లేదా అనేది పిన్ కోడ్ ఆధారంగా తెలుసుకోవచ్చు.

IKEA
Furniture Store
Home Delivery
Hyderabad
Telangana
Andhra Pradesh
Karnataka
Maharashtra
  • Loading...

More Telugu News