Arbaaz khan: అశ్విన్ బాబు సినిమాలో అర్బాజ్ ఖాన్!

Arbaaz khan in Ashwin Babu Movie

  • అశ్విన్ బాబు హీరోగా మరో సినిమా 
  • ఆయన సరసన మెరవనున్న దిగాంగన సూర్య వన్షీ
  • ఆల్రెడీ సెట్స్ పై ఉన్న ప్రాజెక్టు 
  • చాలా గ్యాప్ తరువాత అర్బాజ్ ఖాన్ ఎంట్రీ


యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోకి తాజాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవ' చిత్రం తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ పాప్యులర్ బాలీవుడ్ నటుడు, ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ 'బిగ్ బ్రదర్' చిత్రంలో కూడా నటించారు. 

చాలా సంవత్సరాల తరువాత మళ్లీ ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1 లో తెరకెక్కుతున్న ఒక డిఫరెంట్ కథలోని ముఖ్య పాత్రను పోషిస్తున్నందుకు, ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. 

 "కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగుపెడుతున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని చెప్పారు. అశ్విన్ బాబు సరసన దిగాంగనా సూర్యవన్షి కథానాయికగా కనిపించనున్నారు. 

Arbaaz khan
Ashwin Babu
Digangana Suryavanshi
  • Loading...

More Telugu News