Pindam: ఆహా ఫ్లాట్ ఫామ్ పైకి హారర్ థ్రిల్లర్ 'పిండం'

Pindam movie OTT release date confirmed

  • డిసెంబర్ 15న వచ్చిన 'పిండం'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • బడ్జెట్ కి మించి కనిపించే కంటెంట్ 
  • ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్


'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి 'పిండం' సినిమా రెడీ అవుతోంది. శ్రీరామ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, హారర్ థ్రిల్లర్ జోనర్లో కొనసాగుతుంది. డిసెంబర్ 15వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ జోనర్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాల కేటగిరిలో చేరిపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించడానికి సిద్ధమవుతోంది. 

'ఆహా'లో ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమాకి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించాడు. చిన్న బడ్జెట్ సినిమానే అయినా, అంతకు మించిన కంటెంట్ ను అందించాడు. 

సాధారణంగా ఈ తరహా కథలు ఓ పాత బంగ్లాలో జరుగుతూ ఉంటాయి. ఈ కథ కూడా పాత బంగ్లాలోనే నడుస్తుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం ... ముఖ్యంగా లైటింగ్ ను సెట్ చేసిన తీరు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. దెయ్యం ఆవహించిన చైల్డ్ ఆర్టిస్ట్ నటన హైలైట్ గా నిలుస్తుంది. 'రివ్యూస్' కాలంలోకి వెళ్లి ఈ సినిమా కథను గురించి తెలుసుకోవచ్చు.

More Telugu News