Mahesh Babu: గడ్డ కట్టించే చలిలో బ్లాక్ ఫారెస్ట్ లో మహేశ్ బాబు ట్రెక్కింగ్

Mahesh Bbau trekking at Black Forest in Germany

  • జర్మనీకి మహేశ్ బాబు హెల్త్ ట్రిప్
  • బాడెన్ బాడెన్ పట్టణంలో డాక్టర్ కోనిగ్ క్లినిక్ సందర్శన
  • సోషల్ మీడియాలో మహేశ్ బాబు పోస్టు

ఇటీవల కాలంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మరింత స్లిమ్ గా, మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. మహేశ్ బాబు కొంతకాలంగా జర్మనీకి చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ హ్యారీ కోనిగ్ సలహాలు, సూచనలతో ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తూ, నిర్దేశిత వ్యాయామాలు చేస్తూ ఎంతో ఫిట్ గా తయారయ్యారు. 

తాజాగా, మహేశ్ బాబు జర్మనీలోని బాడెన్ బాడెన్ పట్టణంలో డాక్టర్ హ్యారీ కోనిగ్ క్లినిక్ ను సందర్శించారు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ పర్వతశ్రేణి దిగువన బాడెన్ బాడెన్ పట్టణం ఉంటుంది. ఈ పట్టణం హెల్త్ క్లినిక్ లు, నేచురోపతి స్పాలకు ప్రసిద్ధి చెందింది. 

బాడెన్ బాడెన్ పట్టణానికి వచ్చిన సందర్భంగా మహేశ్ బాబు, డాక్టర్ కోనిగ్ తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ పర్వతశ్రేణిని అధిరోహించారు. గడ్డ కట్టించే శీతల పరిస్థితుల్లో డాక్టర్ హ్యారీ కోనిగ్ తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేశాను అంటూ మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. 

ఈ పోస్టుపై మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్ స్పందించారు. నిన్ను ఎంతో మిస్సవుతున్నానంటూ రిప్లయ్ ఇచ్చారు.

More Telugu News