G Jagadish Reddy: మంత్రి కాగానే కోమటిరెడ్డి అధికారమదంతో ప్రవర్తిస్తున్నారు: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy fires at Komatireddy Venkat Reddy

  • సందీప్ రెడ్డి నాన్న ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పి సిగరెట్లు అందించుకుంటూ బతికావని విమర్శలు
  • రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్నట్లు నీ తమ్ముడే చెబుతున్నాడన్న జగదీశ్ రెడ్డి
  • ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కోమటిరెడ్డి జిల్లాను ఏ మేరకు అభివృద్ధి చేశాడు? అని నిలదీత

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కాగానే అధికారమదంతో ప్రవర్తిస్తున్నారని... ఆయనకు అహంకారం పెరిగిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారిక కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి, అతని అనుచరులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.

సందీప్ రెడ్డి వాళ్ల నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పి సిగరెట్లు అందించుకుంటూ బతికావని.. ఆ విషయం మరిచిపోయవా? అని ప్రశ్నించారు. చరిత్ర తీద్దామా? వ్యక్తిగత విమర్శలు వద్దని ఇన్ని రోజులు ఊరుకున్నామని హెచ్చరించారు. ఉద్యమం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గెంటేస్తున్నాడని తెలిసి రాజీనామా చేసి పెద్ద త్యాగం చేశానంటూ డ్రామాలు చేశాడని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్నావని నీ తమ్ముడే చెబుతున్నాడని విమర్శించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కోమటిరెడ్డి జిల్లాను ఏ మేరకు అభివృద్ధి చేశాడు? అని ప్రశ్నించారు. దౌర్జన్యాలు చేసినవాళ్లు కాల గర్భంలో కలిసిపోయారని మండిపడ్డారు. సందీప్ ఒక్క అక్షరం కూడా తప్పు మాట్లాడలేదన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్నారన్నారు.

More Telugu News