Xi Jinping: సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిద్దాం: మేక్రాన్ తో జిన్ పింగ్

Xi Jinping offers Macron break new world

  • భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
  • భారత్ పర్యటన అనంతరం చైనాకు పయనం
  • చైనా అధినేత జిన్ పింగ్ తో సమావేశం

భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ చైనా పర్యటనకు వెళ్లారు. చైనా-ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలు 60వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో మేక్రాన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, మేక్రాన్ తో భేటీ సందర్భంగా జిన్ పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

చైనా-ఫ్రాన్స్ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళుతూ, సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిద్దాం అని పిలుపునిచ్చారు. ప్రపంచం మరోసారి క్లిష్ట పరిస్థితుల్లో నిలిచిందని... శాంతి, భద్రత, సంక్షేమం, పురోగతి, మానవాభివృద్ధి కోసం చైనా-ఫ్రాన్స్ సంయుక్తంగా ద్వారాలు తెరవాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవ సందర్భాన్ని ఓ అవకాశంగా భావిస్తున్నామని, ప్రాథమిక సిద్ధాంతాల పునాదులపై గత అనుభవాల ఆధారంగా నవ్య భవితకు బాటలు వేస్తామని జిన్ పింగ్ వివరించారు. 

చైనా-ఫ్రాన్స్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేస్తామని, మరింత క్రియాశీలకంగా మార్చుతామని పేర్కొన్నారు. 

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిస్తూ, తమ దేశంలోకి ఫ్రాన్స్ నుంచి మరిన్ని దిగుమతులకు అనుమతి ఇస్తామని తెలిపారు.

More Telugu News