Strip On Road: డబ్బు దొంగిలించి పారిపోతూ.. దొరికిపోకుండా దుస్తులు విప్పి నగ్నంగా నడిరోడ్డుపై కూర్చున్న మహిళలు

Four Women Stripped On Road To Avoid Being Caught By Mob
  • గుజరాత్‌లోని వడోదరలో ఘటన
  • లాండ్రీ షాప్ నుంచి రూ. 25 వేలు చోరీ చేసిన నలుగురు మహిళలు
  • తమ దుస్తులు విప్పించి రోడ్డుపై కూర్చోబెట్టారని మహిళల ఆరోపణ
  • నిర్ధారించుకునేందుకు సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తున్న పోలీసులు
ఓ దుకాణంలో రూ. 25 వేలు చోరీ చేసి పారిపోతున్న నలుగురు మహిళలు తమను వెంబడిస్తున్న వారికి పట్టుబడకుండా నడిరోడ్డుపై దుస్తులు విప్పి కూర్చుండిపోయారు. గుజరాత్‌లోని వడోదరలో జరిగిందీ ఘటన. ఇంతకీ ఏం జరిగింటే.. కరేలీబాగ్ సమీపంలోని అంబాలాల్ పార్క్‌లో ఇక్బాల్ ధోబీ లాండ్రీ షాప్ నిర్వహిస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నలుగురు మహిళలు షాపులోకి వచ్చి ఇక్బాల్‌ను మాటల్లో పెట్టి రూ. 25 వేలు చోరీ చేసి పరారయ్యారు. ఆ తర్వాత చోరీని గుర్తించిన ఇక్బాల్ మరికొందరితో కలిసి మహిళలను వెంబడించారు. 

తమను వెంబడిస్తున్న విషయాన్ని గుర్తించిన మహిళలు వారికి దొరక్కుండా ఉండేందుకు నడిరోడ్డుపై దుస్తులు విప్పి కూర్చుండిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అర్ధనగ్నంగా రోడ్డుపై కూర్చున్న మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

మహిళలు మాత్రం తమను వెంబడించిన వారే దాడిచేసి దుస్తులు విప్పించి కూర్చోబెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే, పట్టుబడకుండా మహిళలు తమంత తామే దుస్తులు విప్పి కూర్చున్నారా? లేదంటే, నిజంగా వారిని వెంబడించిన వారే దుస్తులు విప్పించారా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. 

నిందితులైన మహిళల నుంచి రూ.9 వేలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారు తప్పించుకుని పరిగెత్తే క్రమంలో మిగతా సొమ్ము రోడ్డుపై ఉద్దేశపూర్వకంగా పడేసినట్టు పేర్కొన్నారు. వారు తమ పేర్లు, ఇతర వివరాలను వెల్లడించకపోవడంతో కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Strip On Road
Women
Gujarat
Vadodara

More Telugu News