Ram Gopal Varma: టీడీపీతో పవన్ పొత్తుపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

RGV on Jana Sena TDP alliance

  • పవన్ కు ఆయనపై ఆయనకు నమ్మకం లేదా? అన్న ఆర్జీవీ
  • జగన్ కు పొత్తులు అవసరం లేదని వ్యాఖ్య
  • పులి సింగిల్ గా వస్తుందన్న వర్మ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ను ఓడించేందుకు ఇతరులతో లేదా ఇతర చెత్త పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో చెప్పకుండా పవన్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. పవన్ కు ఆయనపై ఆయనకు నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. తనను లేదా తాను పొత్తు పెట్టుకున్న పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని ఆయన అనుకుంటున్నారా? అని అడిగారు. జగన్ కు ఆయనపై ఆయనకు పూర్తి నమ్మకం ఉందని... అందుకే ఆయనకు పొత్తులు అవసరం లేదని చెప్పారు. నక్కలు గుంపులుగా వస్తాయని, పులి సింగాల్ గా వస్తుందని అన్నారు.

Ram Gopal Varma
Tollywood
Pawan Kalyan
Janasena
Jagan
YSRCP
AP Politics
  • Loading...

More Telugu News