YS Sharmila: ఇడుపులపాయలో రెండు గంటల పాటు చర్చలు జరిపిన షర్మిల, సునీత

YS Sharmila and Sunitha meeting in Idupulapaya

  • సునీత కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం
  • నేడు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
  • సమావేశానికి హాజరుకానున్న సునీత

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. ఇడుపులపాయలో ఆమె షర్మిలతో భేటీ అయ్యారు. సునీత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు గంటల సేపు వీరు చర్చలు జరిపారు. పీసీసీ బాధ్యతలను చేపట్టిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే తొలిసారి. వివేకా హత్య కేసులో సునీతకు షర్మిల మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. 

మరోవైపు కాసేపట్లో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సునీత కూడా హాజరుకానున్నారు. ఇంకోవైపు పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల, కడప ఎంపీ స్థానం నుంచి సునీత పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

YS Sharmila
YS Sunitha
Congress
Kadapa
AP Politics
  • Loading...

More Telugu News