Yatra-2: న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ స్క్రీన్లపై సందడి చేసిన యాత్ర-2

Yatra2 featured on New York Times Square

  • వైఎస్సార్ జీవితం ఆధారంగా యాత్ర
  • సీక్వెల్ గా వస్తున్న యాత్ర-2
  • ప్రధాన పాత్రల్లో మమ్ముట్టి, జీవా 
  • ఫిబ్రవరి 8న రిలీజ్

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ కూడా వస్తోంది. మమ్ముట్టి వైఎస్సార్ గా నటిస్తుండగా, జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాత్ర-2 చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. 

ఇక అసలు విషయానికొస్తే... అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద యాత్ర-2 విజువల్స్ ప్రదర్శించారు. న్యూయార్క్ లో సందర్శనీయ స్థలంగా పేరుగాంచిన టైమ్స్ స్క్వేర్ లోని డిజిటల్ స్క్రీన్లపై యాత్ర-2 స్టిల్స్ ప్రదర్శించారు. దీనికి సంబంధించిన స్లైడర్ వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

More Telugu News