Amit Shah: బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో... అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

Amit Shah telangana tour canceled

  • రేపు మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో బీజేపీ సమావేశాల రద్దు
  • అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందన్న కిషన్ రెడ్డి
  • ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి బీజేపీ వైపు నితీశ్ కుమార్ అడుగులు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి.

బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్‌లో నితీశ్ కుమార్ I.N.D.I.A. కూటమికి గుడ్‌బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది.

Amit Shah
G. Kishan Reddy
Telangana
Bihar
  • Loading...

More Telugu News