YS Jagan: రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం... సతీసమేతంగా హాజరైన సీఎం జగన్

AP CM Jagan attends At Home in Raj Bhavan

  • నేడు రిపబ్లిక్ డే
  • లాంఛనంగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్
  • హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అక్కడ అల్పాహార విందు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైసీపీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.

More Telugu News