KCR: కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

BRS Parliamentary Meeting

  • ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశం
  • హాజరైన కేటీఆర్, హరీశ్, పార్టీ ఎంపీలు
  • పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమయింది. సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ, లోక్ సభల్లో పార్టీ ఫ్లోర్ లీడర్లు కేశవరావు, నామా నాగేశ్వరరావులతో పాటు రాజ్యసభ సభ్యులు, లోక్ సభ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. 

KCR
BRS
KTR
Harish Rao
Parliamentary Party Meeting
  • Loading...

More Telugu News