Chiranjeevi: ఈ గొప్ప దేశంలో మీరొక నిష్కళంక పౌరుడు: చిరంజీవికి 'పద్మ విభూషణ్' పై రామ్ చరణ్ స్పందన

Ram Charan reacts on Padma Vibhushan to Chiranjeevi

  • పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
  • మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్
  • మీరు అన్ని విధాలా అర్హులు అంటూ రామ్ చరణ్ ట్వీట్

కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మ పురస్కారాలను ప్రకటించడం తెలిసిందే. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి 'పద్మ విభూషణ్' అవార్డు ప్రకటించారు. దీనిపై చిరంజీవి తనయుడు, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. 

"ప్రతిష్ఠాత్మక 'పద్మ విభూషణ్' అవార్డు అందుకోబోతున్న చిరంజీవి గారికి కంగ్రాచ్యులేషన్స్. ఈ పురస్కారానికి మీరు అన్ని విధాలా అర్హులు. భారతీయ సినిమాకు, సమాజానికి విస్తృత స్థాయిలో మీరు అందించిన సేవలు... నన్ను తీర్చిదిద్దడంలోనూ, అశేష అభిమానులకు స్ఫూర్తిగా నిలవడంలోనూ కీలకపాత్ర పోషించాయి. ఈ గొప్ప దేశంలో మీరొక నిష్కళంక పౌరుడు. 

చిరంజీవి గారికి ఇంతటి విశిష్ట గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చినందుకు భారత కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంతో మద్దతుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం" అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

More Telugu News