Republic Day: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
- ప్రత్యేక సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్
- గణతంత్ర దినోత్సవ వేళ మీ వద్దే ఉన్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందన్న మేక్రాన్
- దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న 75వ గణతంత్ర వేడుకలు
దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘75వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు. జై హింద్!’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ఇక ఇమాన్యుయేల్ మేక్రాన్ కూడా భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘నా ప్రియ నేస్తం నరేంద్ర మోదీ, భారతీయ ప్రజలకు మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ వద్దే ఉన్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. వేడుకలు జరుపుకుందాం!’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
కాగా దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డాక్టర్ అంబేద్కర్‌ను 'రాజ్యాంగ పితామహుడు' అని పిలుస్తారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క 'విక్షిత్ భారత్', 'భారత్: ప్రజాస్వామ్యానికి మాతృక' అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు జరుగుతున్నాయి. దేశ ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్య సంరక్షణను ఈ ఇతివృత్తం తెలియజేస్తోంది. కాగా ఉదయం 10:30 గంటలకు దేశరాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ కవాతు జరగనుంది. దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగనుంది.