Jai Hanuman: జై హనుమాన్ సినిమాలో నటించే ఆ స్టార్ హీరో బాలీవుడ్ నటుడే!

Bollywood star in Jai Hanuman Movie

  • హనుమంతుడి కోసం బాలీవుడ్ నటులకు ప్రశాంత్‌వర్మ ఆడిషన్స్
  • ఆ పాత్రకు తగిన న్యాయం చేసే వారినే తీసుకుంటామన్న దర్శకుడు
  • ఆ సినిమాలో దేశంలోని ప్రముఖ నటులందరూ కనిపిస్తారని వ్యాఖ్య

హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’ మూవీలో ఆంజనేయుడి పాత్రలో ప్రముఖ హీరో నటిస్తాడని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే, ఆ హీరో తెలుగు ఇండస్ట్రీ నుంచి కాదని తాజాగా స్పష్టమైంది. ఆ పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఒకరు నటిస్తారని తెలిసింది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటులకు ఆడిషన్స్ కూడా చేస్తున్నారు. ఆ పాత్రకు తగిన న్యాయం చేయగలిగే వారినే తీసుకుంటామని ప్రశాంత్ వర్మ తెలిపారు.

మేకప్, లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఆ నటుడిని ఎంపిక చేయబోతున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే అందుకు సంబంధించి వివరాలను ప్రకటిస్తామన్నారు. జై హనుమాన్ సినిమాలో దేశంలోని ప్రముఖ నటులందరూ కనిపిస్తారని తెలిపారు. హనుమాన్ సినిమా కంటే తాను రూపొందిస్తున్న ‘అధీర’ సినిమా చాలా పెద్దదని, ఇందులోనూ హనుమంతుడి సీన్లు ఉంటాయని ప్రశాంత్‌వర్మ తెలిపారు.

Jai Hanuman
Tollywood
Prashanth Varma
Bollywood
  • Loading...

More Telugu News